: జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ ధర్నాకు మద్దతు తెలిపిన లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్
తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ చేస్తోన్న ధర్నాకు లోక్‌సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ మద్దతు తెలిపారు. జంతర్ మంతర్ వద్దకు చేరుకున్న ఆమె.. సమ్మెలో పాల్గొంటున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తాను సామాజిక న్యాయమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఎమ్మార్పీఎస్ డిమాండ్ ఉందని, తాను అప్పట్లో ఈ సమస్య పరిష్కారానికి ఉషా మెహ్రా కమిటీని ఏర్పాటు చేశానని అన్నారు. దానిపై కమిటీ నివేదక కూడా రూపొందించిదని ఆమె పేర్కొన్నారు. దాని ప్రకారంగానే సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.