: విరిగిన సోనియా ముంజేతి ఎముక... ప్రస్తుతం ఐసీయూలో?


రెండు రోజుల క్రితం వారణాసిలో జరుగుతున్న ర్యాలీలో పాల్గొనే వేళ అస్వస్థతకు గురై తొలుత ఆర్మీ ఆసుపత్రిలో, ఆపై సర్ గంగారామ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ముంజేతి ఎముక విరిగినట్టు 'టైమ్స్ ఆఫ్ ఇండియా' ఓ కథనాన్ని ప్రచురించింది. ర్యాలీ సందర్భంగా ప్రజలకు ఆమె అభివాదం చేస్తూ కింద పడిపోయారని పేర్కొంది. ప్రస్తుతం ఆమె ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో చికిత్సను పొందుతున్నారని, ఈ వారంలో డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఆమెకు డాక్టర్ అరూప్ బసు నేతృత్వంలోని డాక్టర్ల బృందం ప్రత్యేకంగా సేవలందిస్తోందని మాత్రమే ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ వార్తలతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఆమె ఆరోగ్యం కుదుటపడాలని పలు ప్రాంతాల్లో పార్టీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.

  • Loading...

More Telugu News