: అద్భుతంగా ఆడారు...వారిని అభినందించాల్సిందే: కుంబ్లే


వెస్టిండీస్ బ్యాట్స్ మన్ అద్భుతంగా ఆడారని టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే అభినందించాడు. కింగ్ స్టన్ లో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసిన అనంతరం కుంబ్లే మాట్లాడుతూ, టీమిండియా విజయం సాధిస్తుందని భావించిన మ్యాచ్ ను డ్రాగా ముగించడంలో విండీస్ బ్యాట్స్ మన్ ప్రతిభకు తార్కాణమని అన్నాడు. మ్యాచ్ ప్రత్యర్థివైపు మొగ్గు చూపుతున్న దశలో వారిని అడ్డుకుని టెస్టును డ్రాగా ముగించడం ఆషామాషీ వ్యవహారం కాదని పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ తో కలిసి ఛేజ్ నెలకొల్పిన భాగస్వామ్యాలు టీమిండియాకు విజయాన్ని దూరం చేశాయని కుంబ్లే చెప్పాడు. తొలి టెస్టుతో పోలిస్తే రెండోటెస్టులో రన్ రేట్ తక్కువగా నమోదైందని ఆయన తెలిపారు. డౌరిచ్, జాసన్ హోల్డర్ తో కలిసి టీమిండియా విజయాన్ని అడ్డుకున్న ఛేజ్ ను అభినందించాల్సిందేనని కుంబ్లే తెలిపాడు.

  • Loading...

More Telugu News