: రొమాన్స్ బాగుంటుంది కానీ రొమాంటిక్ గా నటించడం అంత సులువు కాదు: జరీన్ ఖాన్
సినిమాల్లో హీరో, హీరోయిన్లు చేసే రొమాన్స్ చూసేందుకు చాలా బాగుంటుంది కానీ, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం అంత ఈజీ కాదని బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ చెబుతోంది. టీ సిరీస్ నిర్మిస్తున్న 'ప్యార్ మాంగా హై' వీడియో ఆల్బమ్ లో అలీ ఫజల్ తో నటిస్తోంది. ఈ సందర్భంగా అలీ ఫజల్ తో కెమిస్ట్రీ గురించి మాట్లాడుతూ, రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం కష్టమని పేర్కొంది. 'షూటింగ్ వాతావరణంలో అంతా చుట్టూ ఉంటారు. సీన్ చేస్తున్న వారినే చూస్తూ ఉంటారు. రిహార్సల్స్ జరుగుతుంటాయి. షూటింగ్ కు ఒకటి అనుకుని వెళ్తే...అక్కడ ఇంకోటి జరుగుతుంది. మనమేమనుకుంటున్నామో అది చేసే అవకాశం ఉండదు' అని చెప్పుకొచ్చిన జరీన్ ఖాన్, రొమాంటిక్ సీన్స్ లో నటించడం కష్టమని తేల్చేసింది. ఇది తనకే కాదు అలీకి కూడా కష్టంగా అనిపించిందని తెలిపింది. అలీ మొదటిసారి తనను ముద్దుపెట్టుకున్నప్పుడు సిగ్గుపడ్డాడని తెలిపింది.