: కాసేపట్లో మోదీని కలవనున్న ఎంపీ కవిత
ప్రధాని నరేంద్ర మోదీని కాసేపట్లో తెలంగాణ ఎంపీ కల్వకుంట్ల కవిత కలవనున్నారు. నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేయమని కోరేందుకు ఆమె ప్రత్యేకంగా ప్రధానిని కలవనున్నారు. ఈ సందర్భంగా పసుపుకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రధానిని ఆమె కోరనున్నారు. పసుపు రైతులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు చేపట్టాలని, వారి సంక్షేమానికి మరింత కృషి చేయాలని ఆమె ప్రధానిని కోరనున్నారు. ఈ సందర్భంగా పసుపు రైతులు పడుతున్న కష్టాలను ప్రధానికి ఆమె వివరించనున్నారు. కాగా, గతంలో నిజామాబాద్ పర్యటన సందర్భంగా అక్కడి ప్రజలకు పసుపు బోర్డు ఏర్పాటుకు కృషి చేస్తానని కవిత హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.