: దూసుకెళుతున్న హిల్లరీ!... 10 పాయింట్ల తేడాతో వెనుకబడ్డ ట్రంప్!


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఆసక్తికర పోరు సాగుతోంది. ఇప్పటికే ఆ దేశంలోని రెండు ప్రధాన పార్టీలు డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు తమ తమ అభ్యర్థులుగా హిల్లరీ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్ లను రంగంలోకి దించాయి. సుదీర్ఘంగా జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో సత్తా చాటిన వీరిద్దరూ అధ్యక్ష బరిలో తలపడేందుకు అర్హత సాధించారు. ఇప్పటిదాకా బాగానే ఉన్నా... రోజులు గడిచేకొద్దీ డొనాల్డ్ ట్రంప్ పై హిల్లరీ క్లింటన్ ఆధిక్యం పెరుగుతూ వస్తోంది. నిన్న రాత్రి వెలువడిన నేషనల్ పోల్ సర్వేలో ట్రంప్ కంటే హిల్లరీ ఏకంగా 10 పాయింట్ల ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న ట్రంప్ క్రమంగా తన ఓటు బ్యాంకును కోల్పోతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఇదే కొనసాగితే త్వరలో జరగనున్న ఎన్నికల్లో ట్రంప్ పై హిల్లరీ భారీ మెజారిటీతో విజయం సాధించే అవకాశాలున్నాయి. ఫాక్స్ న్యూస్ సర్వే ప్రకారం హిల్లరీ 49 శాతంతో ముందుండగా, ట్రంప్ మాత్రం ఆమె కంటే 10 పాయింట్లు వెనకగా 39 శాతంతో ఉన్నారు. ఇక సీఎన్ఎన్-ఓఆర్సీ సర్వే ప్రకారం ట్రంప్ కంటే హిల్లరీ 9 పాయింట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • Loading...

More Telugu News