: శిక్షణ ముగించుకుని వచ్చిన శ్రీకాంత్!... టూరిజం ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించిన ఏపీ సర్కారు!
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో కీలక భూమిక పోషిస్తున్న సీఆర్డీఏకు తొలి కమిషనర్ గా యువ ఐఏఎస్ అధికారి నాగులపల్లి శ్రీకాంత్ కీలక బాధ్యతలు నిర్వర్తించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు పరిదిలోని గ్రామాల్లో దాదాపు 33 వేలకు పైగా ఎరరాల భూమిని రైతులు స్వచ్ఛందంగా ఇచ్చేందుకు ముందుకు రావడంలో ఆయన కీలకంగా వ్యవహరించారు. అంతేకాక భూసేకరణ సహా, తాత్కాలిక సచివాలయం నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాల్లో ఆయన పక్కాగా చర్యలు చేపట్టినట్లు ప్రభుత్వమే చెప్పింది. ఈ క్రమంలో ఐఏఎస్ అధికారులకు తప్పనిసరి శిక్షణ నేపథ్యంలో ఆయన రెండు నెలల పాటు ముస్సోరి వెళ్లాల్సి వచ్చింది. ఈ క్రమంలో గుంటూరు జాయింట్ కలెక్టర్ గా ఉన్న చెరుకూరి శ్రీథర్ ను ప్రభుత్వం సీఆర్డీఏ కమిషనర్ గా నియమించింది. ఈలోగానే శిక్షణ ముగించుకుని శ్రీకాంత్ నిన్న ఏపీకి చేరారు. అయితే అప్పటికే ఆ పోస్టులో శ్రీధర్ ఉండటంతో శ్రీకాంత్ ను పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.