: చెప్పినట్టే చేశాం... ఇంకా పుంజుకుంటాం : విండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్


రెండో టెస్టులో చెప్పినట్టే చేశామని వెస్టిండీస్ కెప్టెన్ జాసన్ హోల్డర్ జట్టు ఆటతీరుపై సంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి టెస్టులో ఇన్నింగ్స్ తేడా ఓటమితో డీలాపడ్డ జాసన్ హోల్డర్ జట్టు ఆటతీరు ఎంతో మెరుగుపడాల్సి ఉందని, ప్రధానంగా బ్యాట్స్ మన్ క్రీజులో పాతుకుపోవాల్సి ఉందని చెప్పాడు. అయితే అతని మాటలు సీనియర్లు పెద్దగా పట్టించుకోకున్నా, వర్ధమాన ఆటగాడు ఛేజ్ సీరియస్ గా తీసుకుని సెంచరీతో రాణించడం, అతనికి టెయిలెండర్లు కెప్టెన్ హోల్డర్‌, బ్లాక్‌ హుడ్‌, డౌరిచ్‌ లు అర్ధసెంచరీలతో రాణించడంతో టెస్టు డ్రా అయిన సంగతి తెలిసిందే. ఛేజ్ బౌలింగ్ లో రాణించి అద్భుత ఫాంలో ఉన్న కోహ్లీని అవుట్ చేయడంతో మరింత ఆధిక్యం దిశగా ఇన్నింగ్స్ సాగకుండా చెక్ పెట్టాడు. బ్యాటింగ్ లో కూడా సత్తాచాటడంతో టెస్టును విండీస్ డ్రాగా ముగించింది. దీంతో తాము పుంజుకుంటామని చెప్పినట్టే చేశామని, ఇదే ఆటతీరు ప్రదర్శిస్తే తరువాతి టెస్టులో కూడా సానుకూల ఫలితం వస్తుందని హోల్డర్ తెలిపాడు. టెస్టు డ్రాగా ముగియడంతో హోల్డర్ సంతోషంలో మునిగిపోయాడు. విండీస్ జట్టు కూడా విజయం సాధించినంత ఆనందలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News