: గుజరాత్ గవర్నర్‌కి రాజీనామా పత్రం స‌మ‌ర్పించిన సీఎం ఆనందీ బెన్ పటేల్


గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందీ బెన్ పటేల్ తన రాజీనామా పత్రాన్ని కొద్ది సేపటి క్రితం ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ ఓం ప్ర‌కాశ్ కోహ్లీకి అందించారు. ముఖ్యమంత్రి రాజీనామాను భార‌తీయ జ‌న‌తా పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదించిన అనంత‌రం ఆనందీబెన్ ఈరోజు రాజ్‌భవన్‌కు వెళ్లి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు. ఆనందీ బెన్ పటేల్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ప్ప‌టి నుంచీ ఆమెను ప‌లు స‌మ‌స్య‌లు చుట్టుముట్టాయి. ప‌టేళ్ల ఆందోళ‌న నుంచి తాజాగా చోటుచేసుకున్న ద‌ళితుల‌పై దాడుల అంశాలు ఆమెపై ఒత్తిడి పెంచాయి. కాగా, త్వర‌లోనే ఆమెను పంజాబ్ గ‌వ‌ర్న‌ర్‌గా నియమిస్తారన్న ప్ర‌చారం జ‌రుగుతోంది.

  • Loading...

More Telugu News