: ఇప్పటికైనా కేసీఆర్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
సర్కారు ప్రయోగిస్తోన్న భూసేకరణ జీవోలు 123, 124లను కొట్టివేసి, 2013 భూసేకరణ చట్టం ప్రకారమే ముందుకెళ్లాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో తెలంగాణ సర్కారుపై ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. హైకోర్టు ఆదేశాలపై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైకోర్టు తీర్పు రైతులు, రైతు కూలీల విజయమని ఆయన అభివర్ణించారు. ఎప్పటికైనా ప్రజాస్వామ్యమే గెలుస్తుందని ఆయన ఉద్ఘాటించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తన తీరుని మార్చుకోవాలని, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. హైకోర్టు తీర్పుని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు.