: భారత్‌కు రావాలని నేపాల్ కొత్త ప్రధాని ప్రచండను ఆహ్వానించిన మోదీ
నేపాల్ కొత్త ప్రధానిగా ఎంపికయిన మావోయిస్టు నేత పుష్ప కమాల్ దహాల్ అలియాస్ ప్రచండకు భారత ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. మంచి మద్దతును సాధించి ప్రధానిగా ఎన్నికయిన ఆయనకు అభినందనలు తెలుపుతున్నట్లు మోదీ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. ప్రచండకి ఫోన్ చేసి ఆయనను భారత్‌కి రావాలని ఆహ్వానించినట్లు మోదీ తెలిపారు. నేపాలీ కాంగ్రెస్‌కు నేతృత్వం వహిస్తున్న ప్రచండ ఆ దేశానికి ప్రధానిగా ఎంపిక కావడం ఇది రెండోసారి.