: తొలిసారిగా జపాన్ వైపు క్షిపణులు పేల్చిన ఉత్తర కొరియా... షింజో అబే సీరియస్ వార్నింగ్


ఉత్తర కొరియా మరోసారి తన దుందుడుకుతనాన్ని ప్రదర్శించి తాజా ఉద్రిక్తతకు దారితీసింది. తొలిసారిగా ఖండాంతర క్షిపణిని జపాన్ వైపు ప్రయోగించింది. ఈ విషయాన్ని అమెరికా సైన్యం స్పష్టం చేసింది. రెండు రొడాంగ్ మధ్యస్థ రేంజ్ క్షిపణులను నార్త్ కొరియా ప్రయోగించగా, ఒకటి టేకాఫ్ కాగానే పేలిపోయిందని, రెండవది జపాన్ నియంత్రణలోని సముద్ర జలాల్లో పడిందని పేర్కొంది. దక్షిణ కొరియాలో యాంటీ మిసైల్ వ్యవస్థను అమెరికా మోహరించడంతోనే ఉత్తర కొరియా ఈ తరహా కవ్వింపు చర్యలకు దిగుతోందని ఆరోపించింది. కాగా, తమ దేశం వైపు దూసుకొచ్చిన ఉత్తర కొరియా క్షిపణి, దేశపు ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉన్న ఉత్తర తీర ప్రాంతానికి 155 మైళ్ల దూరం వరకూ వచ్చి పడిపోయినట్టు జపాన్ ప్రధాని షింజో అబే తెలిపారు. దీన్ని దేశ భద్రతకు ముప్పుగా భావిస్తున్నామని, ఈ తరహా చర్యలను సహించేది లేదని, ఉత్తర కొరియాకు బుద్ధి చెబుతామని తీవ్రంగా హెచ్చరించారు.

  • Loading...

More Telugu News