: వీడని డోపింగ్ వివాదాలు!... ఎయిర్ పోర్టులో స్ప్రింటర్ పట్టివేత!
ప్రతిష్ఠాత్మక రియో ఒలింపిక్స్ కు సమయం ఆసన్నమవుతున్న కొద్దీ భారత్ ను డోపింగ్ వివాదాలు పట్టి పీడిస్తున్నాయి. ఇప్పటికే డోపింగ్ కు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొన్న రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఎట్టకేలకు వివాదం నుంచి బయటపడ్డాడు. ఈ క్రమంలో భారత క్రీడాకారులు సంతోషంగా రియోకు బయలుదేరుతున్న సమయంలో మరో బాంబు పేలింది. డోపింగ్ పరీక్షల్లో భారత స్ప్రింటర్ ధరమ్ వీర్ సింగ్ పట్టుబడ్డాడు. ల్యాబ్ టెస్టుల్లో సింగ్ నిషేధిత ఉత్ప్రేరకాలను వినియోగించారని తేలింది. దీంతో అప్పటికే రియోకు వెళ్లేందుకు ఎయిర్ పోర్టు చేరుకున్న అతడిని... విమానం ఎక్కుతాడనగా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.