: ముగిసిపోయిన వివాదం గురించి నేనేమని చెప్పాలి?: అక్షయ్ కుమార్


ముగిసిపోయిన వివాదం గురించి ఇప్పుడు మాట్లాడడం సరికాదని బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తెలిపాడు. పాతతరం స్టార్ యాక్టర్ రాజేశ్‌ ఖన్నా ఓ అథమస్థాయి నటుడని, అతని వల్ల బాలీవుడ్‌ లో చెత్త సినిమాలు వచ్చాయని ప్రముఖ నటుడు నసీరుద్దీన్‌ షా ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై 'రుస్తుం' సినిమా ప్రమోషన్ లో ఉన్న అక్షయ్ కుమార్ ను మాట్లాడమని అడుగగా... సినీ పరిశ్రమలో 25 ఏళ్లుగా ఉన్నానని, వేరే నటుడి గురించి తానెప్పుడూ మాట్లాడలేదని అన్నాడు. తెలివైన వారు తమ పని ఏదో తాము చూసుకుంటారని అంతా అంటారని, తాను కూడా తన పనేదో తాను చూసుకుంటానని, ఇతరుల మీద వ్యాఖ్యలు చేయడానికి తానెవరినని? ప్రశ్నించాడు. ఆ వ్యాఖ్యల విషయంలో నసీరుద్దీన్ షా క్షమాపణలు చెప్పారని గుర్తు చేసిన ఆయన, అప్పటితోనే వివాదం సమసిపోయిందని అన్నాడు. ఈ విషయంలో ప్రతి ఒక్కరూ స్పందించారని, వారంతా మాట్లాడేసిన తరువాత తాను మాట్లాడేందుకు ఏమీ మిగల్లేదని అక్షయ్ తెలిపాడు. దానిని మర్చిపోవడమే మంచిదని అన్నాడు.

  • Loading...

More Telugu News