: జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులతో దాడి
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నయీమ్ ఇంటిపై నిరసనకారులు పెట్రోల్ బాంబులను విసిరారు. ఉగ్రవాది బుర్హాన్ వని ఎన్ కౌంటర్ అనంతరం కొనసాగుతున్న ఆందోళనల్లో భాగంగా మంత్రి ఇంటి ముందుగా వెళుతున్న ఆందోళనకారులు ఈ దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో నయీమ్ సహా ఆయన కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే ఉన్నారు. ఈ దాడి నుంచి నయీమ్, ఆయన కుటుంబ సభ్యులు సురక్షితంగా బయటపడ్డారని, వారిని మరో ప్రాంతానికి క్షేమంగా తరలించామని భద్రతా దళాలు వెల్లడించాయి. దాడి ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.