: 'జేమ్స్ బాండ్' హీరోయిన్ బాలీవుడ్ కలలు!
'జేమ్స్ బాండ్' సినిమా 'కేసినో రాయల్'లో విలన్లలో ఒకరి భార్యగా నటించి, 'జేమ్స్ బాండ్'తో ఒక రాత్రి గడిపిన ప్రియురాలి పాత్రలో నటించి మెప్పించిన ఇటాలియన్ నటి కేథరిన్ మురీనొ బాలీవుడ్ కలలు కంటోంది. బాలీవుడ్ లో నటించి హాలీవుడ్ కు ఎప్పుడెళ్దామా? అని ఇక్కడ నటీమణులు ఆశగా ఎదురు చూస్తున్నవేళ... ప్రఖ్యాత 'జేమ్స్ బాండ్' గాళ్ గా నటించి బాలీవుడ్ వైపు కేథరీన్ మురీనొ చూడడం విశేషం. రాజీవ్ ఝవేరీ దర్శకత్వంలో రూపొందిన హిందీ సినిమా 'ఫీవర్'లో స్పెషల్ సాంగ్ లో నటించిన కేథరీన్ మాట్లాడుతూ, బాలీవుడ్ సినిమాలంటే తన దృష్టిలో డ్యాన్సులని చెప్పింది. తానే కాదు, హాలీవుడ్ లో చాలా మంది నటీనటులకు బాలీవుడ్ పేరు వింటే గుర్తొచ్చేది డ్యాన్సులేనని ఆమె తెలిపింది. అందుకే ఎప్పటికైనా బాలీవుడ్ సినిమాలో డ్యాన్స్ చేయాలని కలలు కనేదాన్నని, 'ఫీవర్' సినిమా ద్వారా ఆ కల 60 శాతం నెరవేరిందని చెప్పిన ఆమె మరిన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించడం ద్వారా తన కలలు వంద శాతం నెరవేర్చుకుంటానని ఆమె తెలిపింది. కాగా, ఈ 'ఫీవర్' సినిమా ఈ నెల 5న విడుదలవుతోంది.