: ఇదే ఊపు కొనసాగిస్తే ముత్తయ్య రికార్డును అశ్విన్ అధిగమించేస్తాడు!


ప్రపంచ స్థాయి స్పిన్నర్ల పేర్లలో తొలి వరుసలో ఎర్రపల్లి ప్రసన్న, అనిల్ కుంబ్లే, షేన్ వార్న్, ముత్తయ్య మురళీధరన్ తదితరులుంటారు. వీరిలో మురళీధరన్ మరీ ప్రత్యేకం. సుదీర్ఘకాలం శ్రీలంకకు ప్రాతినిధ్యం వహించిన మురళీధరన్ 133 టెస్టుల్లో 67 సార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లను నేలకూల్చి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అతని రికార్డు సమం చేయాలంటే అంతకంటే అత్యుత్తమ స్పిన్ టెక్నిక్ ప్రదర్శించగలగాలి. తాజాగా టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ దూకుడుగా వికెట్లు తీస్తున్నాడు. వికెట్ల వేటలో దూసుకుపోతున్న అశ్విన్ ఇప్పటివరకు 34 టెస్టులాడగా, 18 సార్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు నేలకూల్చాడు. దీంతో మురళీధరన్ రికార్డు బ్రేక్ చేసే సత్తా అశ్విన్ కు ఉందని, అయితే సుదీర్ఘ కాలం ఫాం కోల్పోకుండా అతను జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News