: సామాన్యులకు చేరువయ్యేందుకు హిల్లరీ క్లింటన్ బస్సు యాత్ర
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీలో నిలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ సామాన్య ప్రజలకు మరింత చేరువవడమే లక్ష్యంగా బస్సు యాత్రను చేపట్టారు. ఇన్ని రోజులూ సభల్లో అందరినీ ఆకట్టుకునేలా ప్రసంగాలు చేస్తూ డొనాల్డ్ ట్రంప్‌పై విమర్శలు గుప్పించిన ఆమె.. తన ప్రచారవేగాన్ని ఇప్పుడు మరింత పెంచారు. అందులో భాగంగానే తన ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ కెయిన్‌తో కలిసి ఆమె.. ప్రత్యేకంగా తయారుచేసిన బస్సులో ప్రచార యాత్రలో పాల్గొన్నారు. బస్సు యాత్రలో హిల్లరీ క్లింటన్ భర్త బిల్‌క్లింటన్, టిమ్ కెయిన్ సతీమణి కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రచారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బ్లూ కలర్ బస్సుపై ‘స్ట్రాంగర్ టుగెదర్’ అనే నినాదం కనపడుతోంది. పెన్సిల్వేనియా, ఒహాయో ప్రాంతాల్లో క్లింటన్ తమ ప్రచారాన్ని చేపట్టారు. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదుర్కుంటోన్న ఈ ప్రాంతాల్లో వారు మూడు రోజులు పర్యటిస్తారు.