: ఎంసెట్-2 లీకేజీ కేసు: షేక్ రమేశ్ అరెస్ట్
ఎంసెట్-2 లీకేజీ కేసులో విచారణ వేగంగా కొనసాగుతోంది. కేసులో షేక్ రమేశ్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐడీ అధికారులు ప్రకటించారు. ప్రకాశం జిల్లా వాసి షేక్ రమేశ్ అలియాస్ రహీమ్ దళారీగా వ్యవహరించినట్లు సీఐడీ అధికారులు తేల్చిచెప్పారు. 14 మంది విద్యార్థులకు రమేశ్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసినట్లు వారు పేర్కొన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు అధికారులు ముగ్గురిని అరెస్టు చేశారు. దళారీ రాజగోపాల్‌రెడ్డిని సీఐడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడి కోసం ముంబయి, ఢిల్లీలో గాలింపు ముమ్మరంగా కొనసాగుతోంది.