: ఏఎన్-32 విమానం అదృశ్యంలో కుట్ర లేదు... రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్ ప్రకటన


వారం రోజుల క్రితం బంగాళాఖాతంపై అదృశ్యమైన భారత వాయుసేన విమానం (ఏఎన్‌-32) ఆచూకీ ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌లేదు. విమానం ఆచూకీ గురించి భ‌ద్ర‌తా బ‌ల‌గాలు తీవ్రంగా గాలిస్తూనే ఉన్నాయి. విమాన అదృశ్యంపై తాజాగా రక్షణ శాఖ మంత్రి మనోహర్‌ పారికర్ ప్రకటన చేశారు. ఏఎన్‌-32 అదృశ్యంపై ఎటువంటి కుట్ర జ‌రగ‌లేద‌నే తాము భావిస్తున్న‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. ‘నేను వ్యక్తిగతంగా పరిస్థితిని ప‌రిశీలిస్తున్నా, బాధిత కుటుంబాలకు అందుబాటులో ఉన్నా’ అని పారికర్ వ్యాఖ్యానించారు. గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రంగా కొనసాగుతూనే ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఆరుగురు సిబ్బంది స‌హా 29 మందితో ఈ నెల 22న తమిళనాడు చెన్నై నుంచి పోర్ట్‌బ్లెయిర్ వెళ్తూ విమానం అదృశ్యమైన సంగ‌తి తెలిసిందే.

  • Loading...

More Telugu News