: పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు.. పాక్ జెండాను తగలబెట్టిన ఆందోళనకారులు
ఇటీవల జరిగిన ఎన్నికల్లో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పార్టీకి అనుకూలంగా ఐఎస్ఐ రిగ్గింగ్ చేసిందంటూ పాక్ ఆక్రమిత కశ్మీర్లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ప్రజలు చేస్తోన్న ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈరోజు అక్కడి ముజఫరాబాద్, కోట్లీ, చినారీ, మిర్పూర్ పట్టణాల్లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపైకొచ్చి నిరసన తెలిపారు. నీలం లోయలో ఆందోళనకారులు పాకిస్థాన్ జెండాను తగలబెట్టారు. నవాజ్ షరీఫ్ పార్టీకి చెందిన ఎన్నికల ప్రచార చిత్రాలకు ఆందోళనకారులు మసిపూశారు. పలుచోట్ల పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.