: పుణెలో ఘోర ప్రమాదం.. భవనం కూలి 9 మంది మృతి
మహారాష్ట్రలోని పుణెలో ఈరోజు ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిన ఘటనలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 10 మందికిపైగా తీవ్ర గాయాలయ్యాయి. కూలిన భవనం కింద చిక్కుక్కున వారిని పోలీసులు, స్థానికులు బయటకు తీస్తున్నారు. ప్రమాదం పట్ల స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం సిమెంటు, ఇటుకలతో భవన నిర్మాణం చేపట్టడంతోనే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం అందాల్సి ఉంది.