: ఏపీ వెనుకబడి ఉంది...న్యాయం చేయండి...పదేళ్లు ప్రత్యేకహోదా ఇవ్వండి!: బీఎస్పీ


ఆంధ్రప్రదేశ్ కు గతంలో బీజేపీ రాజ్యసభ సాక్షిగా మాట ఇచ్చిన ప్రకారం పదేళ్లపాటు ప్రత్యేకహోదా ఇవ్వాలని బీఎస్పీ డిమాండ్ చేసింది. అప్పటి విపక్షంగా ఇప్పటి అధికార పార్టీ ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలని బీఎస్పీ సూచించింది. పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఏపీకి ఏం ఇవ్వాలని నిర్ణయించారో...వాటన్నింటినీ తక్షణం ఇవ్వాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. అక్కడి ప్రజలకు విభజన చట్టంలో ఎన్నో హామీలు ఇచ్చారని ఆ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న ఎంపీ తెలిపారు. వ్యవసాయ దారులు మొదలుకుని ఉన్నత వర్గాల వరకు ఏపీలో ప్రజలకు న్యాయం చేయాలని ఆయన సూచించారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా కల్పించడం ద్వారా అక్కడి ప్రజలు నిలదొక్కుకునే వెసులుబాటు కల్పించాలని బీఎస్పీ అధినేత మాయావతి ఆకాంక్ష అని ఆయన తెలిపారు. తమ పార్టీ అధినేత ఆకాంక్ష మేరకు ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేకహోదాతో పాటు ఆర్థిక అవసరాలు తీర్చి, ఇతర సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News