: ట్రంప్ ప్రపంచంలోని అన్ని సమస్యలను తీరుస్తారు: రాంగోపాల్ వర్మ
సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో మరోసారి చెలరేగిపోయి ట్వీట్లు చేశాడు. అమెరికా అధ్యక్ష పదవిని ఆశిస్తోన్న డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి ట్వీట్లు చేశాడు. ఇంతకుముందు ఓసారి ట్రంప్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అటువంటి ట్వీట్లే చేశాడు. అగ్రరాజ్యం అమెరికాకు డొనాల్డ్ ట్రంప్ అత్యంత గొప్ప ప్రెసిడెంట్ అవుతాడని తనకు అనిపిస్తున్నట్లు వర్మ పేర్కొన్నాడు. అంతటితో ఆగకుండా ట్రంప్‌తో పోల్చిచూస్తే ఆ దేశ మాజీ అధ్యక్షులయిన రూజ్ వెల్ట్, లింకన్, కెన్నడీలు ఇడియట్స్ గా అనిపిస్తారని వర్మ ట్వీట్ చేశాడు. అమెరికన్లు మొదటిసారి మంచిగా ఆలోచించి ట్రంప్‌ను తమ దేశాధ్యక్షుడిగా ఎన్నుకోవాలనుకుంటున్నారని ఆయన పేర్కొన్నాడు. ఆయన కేవలం అమెరికా సమస్యలనే కాకుండా మొత్తం ప్రపంచంలోని అన్ని సమస్యలను తీరుస్తాడని, ఆయనపై తనకు గొప్ప నమ్మకం ఉందని వర్మ పేర్కొన్నాడు.