: పరబ్రహ్మశాస్త్రి ఇకలేరన్న వార్త నన్ను బాధిస్తోంది: సినీనటుడు బాల‌కృష్ణ‌


చరిత్ర పరిశోధకులు డాక్టర్ పుచ్చా వాసుదేవ పరబ్రహ్మశాస్త్రి(95) మృతి ప‌ట్ల సినీన‌టుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. "గౌతమిపుత్ర శాతకర్ణి" దర్శకులు క్రిష్ స‌హా చిత్రం బృందం పరబ్రహ్మశాస్త్రికి నివాళులర్పించారు. శాతవాహనులు, కాకతీయుల చరిత్రను పరిచయం చేసిన పరబ్రహ్మశాస్త్రి మ‌న మ‌ధ్య ఇక లేరు అన్న విష‌యం త‌న‌ను బాధిస్తోంద‌ని ఈ సందర్భంగా బాల‌కృష్ణ‌ అన్నారు. తన 100వ చిత్రం "గౌతమిపుత్ర శాతకర్ణి" కోసం శాతవాహనుల్లో ఐదవ రాజైన శాతకర్ణి గురించి పరబ్రహ్మశాస్త్రి గారి ర‌చ‌న‌ల నుంచే గ్ర‌హించామ‌ని ఆయ‌న చెప్పారు. ఆయ‌న కుటుంబానికి తాను అండ‌గా నిలుస్తాన‌ని బాల‌కృష్ణ అన్నారు. తెలుగు భాష‌పై పరబ్రహ్మ శాస్త్రి ఎంతో మ‌మ‌కారాన్ని చూపార‌ని ఆయ‌న గుర్తు చేసుకున్నారు.

  • Loading...

More Telugu News