: ‘కబాలి’పై నానా పటేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు


ప్రపంచ వ్యాప్తంగా విడుదలై రికార్డు కలెక్షన్లు సాధించిన ‘కబాలి’ చిత్రంపైన, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పైన బాలీవుడ్ నటుడు నానా పటేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నటుల్లో ఎవరూ ప్రత్యేకంగా సూపర్ స్టార్ లుండరని, కథ బాగుంటే చిన్న సినిమా అయినా రికార్డు వసూళ్లు చేస్తుందని అన్నారు. మన దేశంలో సినిమా అనేదే సూపర్ స్టార్ అని, కథ బాగుండకపోతే ఎంతటి స్టార్ హీరో సినిమా అయినా కొట్టుకుపోవాల్సిందేనని నానా పటేకర్ వ్యాఖ్యానించారు. కాగా, ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ‘కబాలి’ వసూళ్లు ఫస్ట్ వీకెండులో రూ.90 కోట్లని, ఇందులో కేవలం అమెరికాలోనే రూ.28 కోట్లు వసూలైనట్లు చిత్ర నిర్మాత కలైపులి ఇటీవల ప్రకటించారు.

  • Loading...

More Telugu News