: వాహనానికి నంబరే 'కబాలి'... 8 లక్షలు పెట్టి కొన్న వీరాభిమాని
రజనీకాంత్ తాజా చిత్రం 'కబాలి' ఎలా ఉందన్న సంగతిని పక్కనబెడితే, ఆ ఫీవర్ మాత్రం అభిమానుల్లో ఎంతమాత్రమూ తగ్గలేదు. తమిళనాడుకు చెందిన రజనీ వీరాభిమాని ఒకరు తన కారుకు 'కబాలి' నంబరుగా చేసుకున్నాడు. ఓ ఆడీ కారును కొనుగోలు చేసిన ఆ అభిమాని 'కేఏ' సిరీస్ కోసం కర్ణాటక వెళ్లి, అక్కడ రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తన కారుకు 'కేఏ 8 ఏఎల్ 1' నంబరును తీసుకుని దాన్ని 'KABALI' అని కనిపించేలా రజనీకాంత్ చిత్రాన్ని జోడించి మరీ చక్కర్లు కొడుతున్నాడు. ఈ నంబరు కోసం అతను రూ. 8 లక్షలు చెల్లించాడని తెలుస్తోంది. తమిళనాడులో తిరుగుతున్న ఈ కారును ఫోటో తీసిన ఓ వ్యక్తి దాన్ని సామాజిక మాధ్యమాల్లో ఉంచగా, అదిప్పుడు వైరల్ అవుతోంది.