: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఫ్లోరిడాలోని నైట్‌క్లబ్‌లో విచక్షణారహితంగా కాల్పులు
వరసగా కాల్పుల ఘటనలతో బెంబేలెత్తిపోతోన్న అమెరికాలో ఈరోజు మరోసారి కాల్పుల కలకలం చెలరేగింది. ఫ్లోరిడాలోని నైట్ క్లబ్‌లోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన ఓ దుండగుడు తన వద్ద ఉన్న తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు మృతి చెందగా, మరో 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. దుండగుడి బారి నుంచి తప్పించుకోవడానికి చాలామంది క్లబ్ నుంచి బయటకు పరుగులు తీశారు. దుండగుడి కాల్పులతో స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అంతమొందించేందుకు బలగాలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.