: గంట నుంచి కోదండరాంను వాహనంలోనే తిప్పుతున్న పోలీసులు
మెదక్ జిల్లాలో చేపట్టిన మల్లన్నసాగర్ ప్రాజెక్టును ఎన్ని విమర్శలు వస్తోన్నా పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండడంతో ఆ అంశంపై ఆందోళనలు తగ్గడం లేదు. అక్కడి పరిస్థితిని అధ్యయనం చేయడానికి ప్రాజెక్టు ముంపు గ్రామాలకు వెళుతున్న జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కోదండరాంను ఒంటిమామిడి వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు.. గంట సేపటి నుంచి ఆయనను పోలీస్ వాహనంలోనే తిప్పుతున్నారు. కోదండరాంతో పాటు టీజేఏసీ నేతలను తరలిస్తోన్న పోలీసుల వాహనాలు ప్రస్తుతం మేడ్చల్ ఔటర్‌రింగ్‌రోడ్డు వద్ద ఉన్నట్లు సమాచారం.