: నర్సింగ్ యాదవ్ రూమ్ మేట్ సందీప్ కూడా డోపీయే... నాడా పరీక్షల్లో విఫలం


ఒలింపిక్స్ పోటీలకు వెళ్లాల్సిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్ డోపీగా పట్టుబడి సంచలనం సృష్టించగా, ఆయన రూమ్ మేట్ సందీప్ యాదవ్ సైతం 'నాడా' (నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజన్సీ) పరీక్షల్లో విఫలమయ్యాడు. వీరిద్దరూ సోనేపత్ లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహిస్తున్న సెంటరులో ఒకే గదిలో కలసి ఉంటారు. సందీప్ సైతం నిషేధిత ఉత్ప్రేరకాలను వాడినట్టు వెల్లడైందని నేషనల్ యాంటీ-డోపింగ్ ఏజన్సీ డైరెక్టర్ జనరల్ నవీన్ అగర్వాల్ తెలిపారు. నర్సింగ్ నుంచి సేకరించిన 'బీ' శాంపిల్ సైతం పాజిటివ్ గానే ఉందని, వీరు స్టెరాయిడ్స్ వాడినట్టు తేలిందని స్పష్టం చేశారు. కాగా, తాను అమాయకుడినని, తనపై కుట్ర చేసి ఇరికించారని నర్సింగ్ యాదవ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మెథాండైనోన్ అనే అనబాలిక్ స్టెరాయిడ్ ను ఉపయోగించినట్టు నాడా వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News