: కుంబ్లే, కోహ్లీలకు ధన్యవాదాలు... వారిద్దరి వల్లే సెంచరీ చేశా: అశ్విన్


వెస్టిండీస్ పర్యటనలో భాగంగా అంటిగ్వాలో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో సత్తా చాటడంపై టీమిండియా స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ స్పందించాడు. టీమిండియా చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే, కెప్టెన్ కోహ్లీల వల్లే సెంచరీ చేయగలిగానని అన్నాడు. వారిద్దరూ తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చడం వల్లే క్రీజులో ఎక్కువ సేపు ఉండగలిగే అవకాశం కలిగిందని, తద్వారా సెంచరీ చేయగలిగానని అన్నాడు. టాప్ 7 బ్యాటింగ్ ఆర్డర్ లో ఉండాలని తాను భావిస్తానని, తద్వారా జట్టుకు అవసరమైన పరుగులు చేయవచ్చని భావిస్తానని అశ్విన్ చెప్పాడు. అయితే ఇంత వరకు అలాంటి అవకాశం దక్కలేదని, వారిద్దరూ తన బ్యాటింగ్ ఆర్డర్ మార్చి, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా కంటే ముందు పంపడం వల్లే తన కెరీర్ లో మూడో శతకం సాధ్యమైందని, ఇందుకు వారిద్దరికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నాడు.

  • Loading...

More Telugu News