: ఈజిప్షియన్ ఎయిర్లైన్స్ విమానం మధ్యధరా సముద్రంలో కూలిపోయి ఉండొచ్చు: విచారణాధికారులు
రెండు నెలల క్రితం ఈజిప్షియన్ ఎయిర్లైన్స్ విమానం ఘోర ప్రమాదానికి గురయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మొత్తం 66 మంది మరణించారు. కాగా, విమాన ప్రమాదానికి గురించిన పలు విషయాలను విచారణాధికారులు తాజాగా వెల్లడించారు. ఈజిప్షియన్ ఎయిర్లైన్స్ విమానం గాల్లో ఉండగానే అందులో మంటలు చెలరేగాయని, దీంతో కాక్‌పిట్ ప్రాంతంలో రెండు ముక్కలుగా విడిపోయిందని ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఆధారంగా వారు పేర్కొన్నారు. విమానం కూలి మధ్యధరా సముద్రంలో పడి ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడానికి గల కారణాలను గురించి తమకు ఇంకా తెలియరాలేదని వారు తెలిపారు. విమాన ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమా? లేక ఉగ్రవాద చర్యా? అనే అంశం గురించి తాము ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు.