: థియేటర్‌లో ఉంటే ‘తలైవా’ మేనియాలో ఉండేవాడిని.. కబాలి తొలి ఆట మిస్సయ్యాను: రాజమౌళి
ప్రస్తుతం దేశంలో ఏ ఇద్దరు సినీ అభిమానులు కలుసుకున్నా రజని 'కబాలి' సినిమా గురించే చర్చ. ఈ సినిమా కోసం ఆఫీసులు, కాలేజీలకు సెలవులు పెట్టి మరీ థియేటర్లకు వెళుతున్నారు. ఒకవేళ ఈ సినిమా ఫస్ట్ షో ఏ కారణం చేతయినా మిస్సయిపోతుంటే తెగ బాధపడిపోతున్నారు. దర్శకుడు రాజమౌళి కూడా తలైవాకు అభిమానే. అయితే రాజమౌళి ఈ చిత్రం ఫస్ట్ షోను చూడలేకపోయారట. ఈ విషయాన్ని జక్కన్న తన ట్విట్టర్ ఖాతా ద్వారా తన అభిమానులకు తెలిపారు. బాహుబలి-2 షూటింగ్ లో బిజీగా ఉండడంతో తాను కబాలి చూడలేకపోయానని రాజమౌళి పేర్కొన్నారు. తాను థియేటర్‌లో ఉంటే మాత్రం ‘తలైవా’ మేనియాలో ఉండేవాడినని తెలిపారు.