: కబాలికి దిష్టి తగలకూడదు.. కొబ్బరికాయలు కొట్టిన విశాఖ వీరాభిమానులు
తలైవా రజనీకాంత్ నటించిన 'కబాలి' ఫీవర్ తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో ఈ హంగామా విపరీతంగా కొనసాగుతోంది. థియేటర్ల ముందు బారులు తీరిన అభిమానులు ‘కబాలి.. కబాలి.. తలైవా.. తలైవా’ అంటూ నినదిస్తున్నారు. రజనీకాంత్ ఎంతో సింపుల్‌గా ఉంటూ హీరోలందరికీ ఆదర్శంగా నిలుస్తారని ఆయన అభిమానులు అంటున్నారు. విశాఖలోని ఓ థియేటర్‌లో రజనీ 'కబాలి'కి దిష్టి తగలకూడదంటూ ఆయన వీరాభిమానులు థియేటర్ ముందు కొబ్బరికాయలు కొట్టారు. రజనీ బాక్సాఫీస్ రికార్డులని బద్దలు కొట్టి తీరుతారని వారు అంటున్నారు.