: బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా
వెస్టిండీస్ తో సిరీస్ ప్రారంభమైంది. ఆంటిగ్వాలో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ గా శిఖర్ ధావన్ ను తీసుకోవాలా? కేఎల్ రాహుల్ ను తీసుకోవాలా? అని ఊగిసలాడిన కెప్టెన్ విరాట్ కోహ్లీ చివరికి సీనియారిటీ వైపే మొగ్గుచూపాడు. దీంతో ధావన్ ఓపెనర్ గా దిగాడు. అతనికి జతగా దిగిన మురళీ విజయ్ (7) ఆరంభంలోనే అవుటయ్యాడు. దీంతో ధావన్ కు జతగా ఛటేశ్వర్ పూజారా దిగాడు. ఇప్పటివరకు 17 ఓవర్లు ఆడి వికెట్ కోల్పోయిన టీమిండియా కేవలం 32 పరుగులు చేసింది. ధావన్ 13 పరుగులతోనూ, పూజారా 7 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. విండీస్ స్టార్ బౌలర్లు గాబ్రియెల్, బ్రాత్ వైట్, చేస్ లతో బౌలింగ్ చేయించిన హోల్డర్ స్వయంగా తను కూడా బౌలింగ్ చేశాడు. కొత్త బంతి అందుకున్న గాబ్రియెల్ తన ఖాతాలో విజయ్ ను వేసుకున్నాడు.