: "ఈ జైలు నుంచి చావకుండా బయటకు వెళుతున్నావ్.. ఇక విలన్ వే"... వైరల్ అవుతున్న కబాలి లీక్డ్ డైలాగ్స్


ఆన్ లైన్లో కనిపిస్తున్న రజనీకాంత్ 'కబాలి' ఇంట్రడక్షన్ సీన్ లోని ఓ డైలాగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాలైన వాట్స్ యాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ తదితరాల్లో శరవేగంగా దూసుకెళుతోంది. జైలు నుంచి బయటకు వచ్చే రజనీ పక్కనే నడుస్తున్న ఓ పోలీసు అధికారి చెబుతున్న డైలాగులివి. బ్యాక్ గ్రౌండ్ లో నీలి రంగు దుస్తుల్లో ఉన్న ఖైదీలు వరుసగా నడుస్తూ ఉండగా, వైట్ షర్ట్, బ్లాక్ కోట్ డ్రస్ తో రజనీని బయటకు తెస్తున్న పోలీసు అధికారి "ఇక్కడే ఉండి మరణించకుండా బయటకు వెళుతున్నావంటే అదృష్టవంతుడివి. ఈమధ్యే 40 మంది ఎన్ కౌంటర్ లో పోయారు. అందులో 30 మంది తమిళులే. ఇక్కడి నుంచి వెళ్లే నువ్వు ఇక విలన్ వే" అని అంటాడు. అంతకుముందు, జైల్లోని మరో ఖైదీ "రెండే నెలలన్నా... నేను బయటకు వస్తాను. నా తలే నీకోసం ఇస్తాను. నేనూ బయటకు వస్తాను" అని జైల్లో రజనీ తోటి ఖైదీ చెబుతున్న డైలాగు కూడా ఉంది.

  • Loading...

More Telugu News