: ఈ చెడ్డ పాత్ర పోషించడం నా జీవితంలో బెస్ట్ థింగ్!: ప్రియాంకా చోప్రా


'క్వాంటికో' సీరియల్ తో హాలీవుడ్ లో పేరుతెచ్చుకున్న ప్రియాంకా చోప్రా 'బేవాచ్' సినిమాతో మరోసారి హాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ సినిమా గురించి 'ఫ్యాషన్' మేగజీన్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆమె పలు వ్యాఖ్యలు చేసింది. 'బేవాచ్' సినిమాలో డ్వెన్ జాన్సన్ (రాక్) మంచికి మారుపేరుగా నిలిచే పాత్ర పోషిస్తుండగా, తాను పోషించే విక్టోరియా పాత్ర నిత్యం కుట్రలు, కుతాంత్రాలతో చెడు తలపెట్టే పాత్ర అని చెప్పింది. అయితే ఈ సినిమాలో నెగిటివ్ పాత్ర పోషించడం తన జీవితంలో బెస్ట్ థింగ్ అని పేర్కొంది. చెడు పనులు చేయడం తనకు వ్యసనం లాంటిదని ప్రియాంక చోప్రా చెప్పింది. నిజజీవితంలో అలాంటి చెడు పనులు చేయలేం కనుక తెరపై చెడ్డ పాత్రల్లో కనిపించడం తనకు ఇష్టమని తెలిపింది.

  • Loading...

More Telugu News