: అప్పుడు సరిపోనన్నారు... ఇప్పుడు సరితూగలేమంటున్నారు: హాలీవుడ్ దర్శకుడు స్పీల్ బర్గ్


కొన్నేళ్ల క్రితం హాలీవుడ్ నిర్మాత బ్రొకోలీ నిర్మించిన ‘బాండ్’ చిత్రానికి దర్శకత్వం వహిస్తానంటే తనపై నమ్మకం లేక అవకాశమివ్వలేదని... ఇప్పుడు తనను దర్శకుడిగా పెట్టుకోవాలంటే సరితూగ లేమంటున్నారని ప్రముఖ దర్శకుడు స్పీల్ బర్గ్ నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఒక రేడియో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 1976లో తాను తెరకెక్కించిన ‘జాస్’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిందన్నారు. అదే సమయంలో, నిర్మాత బ్రొకోలీ బాండ్ చిత్రాన్ని నిర్మించే సన్నాహాల్లో ఉన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తానని ఆయన్ని కోరానని, అయితే, తనపై ఆయనకు నమ్మకం లేకపోవడంతో ఆ అవకాశమివ్వలేదన్నారు. ఇప్పుడేమో, తనని దర్శకుడిగా పెట్టుకునే విషయంలో సరితూగలేమంటున్నారని స్పీల్ బర్గ్ అన్నారు.

  • Loading...

More Telugu News