: హాలీవుడ్లో యాక్షన్ స్టార్గా ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే.. మూవీ ట్రైలర్ విడుదల


డిజె కరుసో దర్శకత్వంలో హాలీవుడ్ యాక్షన్ స్టార్ విన్ డీసెల్ లీడ్ రోల్లో తెరకెక్కుతోన్న హాలీవుడ్ మూవీ ‘ట్రిపులెక్స్: రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్’. బాలీవుడ్ భామ దీపికా పదుకొనే ఈ సినిమాతో హాలీవుడ్‌లో అడుగు పెడుతోంది. ఈ మూవీ ఫ‌స్ట్ లుక్ ని ఆ చిత్ర బృందం విడుద‌ల చేసింది. ట్రైలర్ ద్వారా సినిమాలో విన్ డీసెల్ చేసే అద్భుత సాహ‌సాల‌ను చిత్ర‌ బృందం చూపించింది. దీపికా పదుకొనే కూడా ఈ ట్రైల‌ర్‌లో యాక్షన్ సీన్ల‌లో క‌నిపిస్తూ త‌న అభిమానుల దృష్టిని ఆక‌ర్షిస్తోంది. ‘ట్రిపులెక్స్: రిటర్న్ ఆఫ్ ఎక్సాండర్ కేజ్’ చిత్రాన్ని వన్ రేస్ ఫిలింస్, రెవల్యూషన్ స్టూడియోస్ సంయుక్తంగా తెర‌కెక్కిస్తున్నాయి. మూవీలో హాలీవుడ్ స్టార్స్‌ టోనిజా, డానీ ఎన్, నిక్కీ జాం కూడా న‌టిస్తున్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 17న ఈ సినిమా అభిమానుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News