: హాకీ దిగ్గజం మొహ్మద్ షాహిద్ ఇక లేరు!
దేశం గర్వించదగ్గ దిగ్గజ క్రీడాకారుడు మహ్మద్ షాహిద్ (56) ఇక లేరు. జాతీయ క్రీడ హాకీలో మేటి క్రీడాకారుడిగా పేరుగాంచిన షాహిద్... 1980లో మాస్కో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించిన భారత జట్టులో ఆయన సభ్యుడిగా ఉన్నారు. కాలేయ, మూత్రపిండాల వ్యాధితో సతమతమవుతున్న షాహిద్ కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో కన్నుమూశారు. కొంతకాలం క్రితం ఈ వ్యాధుల బారిన పడ్డ షాహిద్ కు.. హాకీ క్రీడాకారుడు ధన్ రాజ్ పిళ్లై చేసిన విజ్ఞప్తితో కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షలు, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.5 లక్షలు విడుదల చేశాయి. వైద్య చికిత్సలు చేయించుకోలేక సతమతమవుతున్న షాహిద్ ను ఆదుకోవాలని నాడు పిళ్లై... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స అందినా... షాహిద్ కోలుకోలేకపోయారు.