: ఫ్రాన్స్ లోని ఒక హోటల్ లోకి చొరబడ్డ ఉగ్రవాది
ఫ్రాన్స్ లోని దక్షిణ ప్రాంతంలోని బోలెన్నీ నగరంలోని ఒక హోటల్ లోకి సాయుధుడైన ఒక ఉగ్రవాది చొరబడినట్లు స్థానికులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బోలెన్నీ లోని ఫార్ములా 1 హోటల్ లో దాక్కుకున్నాడని, అతని లక్ష్యమేమిటో తెలియదని అన్నారు. సాయుధుడి వద్ద కత్తి, పేలుడు పదార్థాలు ఉన్నట్లు అనుమానిస్తున్నామని, ఆ హోటల్ ను చుట్టుముట్టామని పోలీసులు పేర్కొన్నారు. కాగా, ఫ్రాన్స్ లోని నీస్ లో జరిగిన ఉగ్ర దాడి సంఘటన తెలిసిందే. ఈ సంఘటన నుంచి ఫ్రాన్స్ ప్రజలు తేరుకోకముందే, మరో ‘ఉగ్ర’ సంఘటన కలకలం రేపడం అక్కడి ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.