: హాలీవుడ్ వెండితెరకు పరిచయమవుతున్న అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్


ఆన్ లైన్ మాధ్యమంగా విక్రయాలు జరిపే ఈ-కామర్స్ సేవల దిగ్గజం అమెజాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జెఫ్ బెజోస్, హాలీవుడ్ వెండితెరకు పరిచయం కానున్నారు. స్టార్ ట్రెక్ సిరీస్ మూడో భాగంగా జెస్టిన్ లిన్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'స్టార్ ట్రెక్ బియాండ్'లో జెఫ్, ఓ గ్రహాంతరవాసిగా కొద్దిసేపు కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఓ షార్ట్ ఫిలింలో నటించిన ఆయన, సినిమాలో కనిపించడం మాత్రం ఇదే తొలిసారి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న చిత్రం షూటింగ్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ ను విస్తరించి, గొప్ప వ్యాపారవేత్తల్లో ఒకరిగా నిలిచిన జెఫ్, ఈ కొత్త అవతారంలో ఎలా అలరిస్తారో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News