: అమెరికాలోని సచ్చిదానంద ఆశ్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్
అమెరికాలోని వర్జీనియాలో ఉన్న యోగిరాజ్ శ్రీ స్వామి సచ్చిదానంద ఆశ్రమాన్ని తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ సందర్శించారు. ఈ విషయాన్ని రజనీ కాంత్ తన ఫేస్ బుక్ ఖాతాలో పేర్కొన్నారు. తన ఆధ్యాత్మిక గురువు సచ్చిదానందకు చెందిన ‘లోటస్ ఆఫ్ ఫెయిత్స్ టెంపుల్’ కు రజనీతో పాటు ఆయన కూతురు సౌందర్య కూడా వెళ్లింది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను పోస్ట్ చేశారు. కాగా, కొన్ని వైద్య పరీక్షల నిమిత్తం రజనీకాంత్ తన కుటుంబంతో అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నెల 22న ‘కబాలి’ సినిమా విడుదల కానుండటంతో రజనీకాంత్ తిరిగి ఇండియాకు వచ్చారు.