: ప్రధానితో కేసీఆర్ భేటీ... మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ప్రధానికి ఆహ్వానం
ఢిల్లీలో ప్రధాని మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు భేటీ అయ్యారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు, పలు అంశాలపై జోక్యం చేసుకోవాలని ఆయన ప్రధానిని కోరారు. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని కేసీఆర్ వినతి చేశారు. హైకోర్టు విభజనకు చర్యలు తీసుకోవాలని ఆయన మోదికి విన్నవించారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ప్రధాని రావాలని కేసీఆర్ ఆహ్వానించారు. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలకు నిధులివ్వాలని కోరారు.