: తప్పు చేసింది, చంపేశాను... క్షమాపణ చెప్పేది లేదన్న మోడల్ బాలోచ్ సోదరుడు


సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరంగా ఫోటోలు పెడుతూ, తమ కుటుంబం పరువును తీస్తున్నందునే సోదరి ఖండీల్ బాలోచ్ ను హత్య చేశానని, ఇందుకు చింతించడం లేదని మహమ్మద్ వసీమ్ చెబుతున్నాడు. పోలీసులు వసీమ్ ను మీడియా ముందు ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశాడు. సోదరిని హత్య చేసినందుకు తానేమీ క్షమాపణ చెప్పబోవడం లేదని స్పష్టంగా చెప్పాడు. తను తప్పు చేసిందని, అందుకే చంపాల్సి వచ్చిందని నిర్దయగా మాట్లాడాడు. 26 ఏళ్ల బాలోచ్ పాక్ లో ప్రముఖ మోడల్ అన్న సంగతి తెలిసిందే. పూర్తిగా ముస్లిం సంప్రదాయ వాదిగా ఉండే వసీమ్, తన సోదరిని పలుమార్లు వారించాడని, అయినా, ఆమె తన వైఖరిని మార్చుకోనందునే హత్య చేసినట్టు తమ విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. ఇది పరువు హత్యేనని ముల్తాన్ పోలీస్ చీఫ్ అజర్ ఇక్రమ్ తెలిపారు. కాగా, పాకిస్థాన్ లో దాదాపు 500 మంది మహిళలు ఇదే తరహాలో పరువు హత్యలకు గురయ్యారు.

  • Loading...

More Telugu News