: అనంతపురంలో నవ్యాంధ్ర పంద్రాగస్టు వేడుకలు

ఈ సంవత్సరం ఆగస్టు 15 వేడుకలను అనంతపురంలో నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అనంతపురంలోని పోలీసు శిక్షణ కళాశాలలో వేడుకల ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్వయంగా ఆదేశించారు. ఏర్పాట్లు ఘనంగా ఉండాలని, శకటాలను అందంగా తయారు చేయాలని, ఇరుగు పొరుగు జిల్లాల నుంచి విద్యాసంస్థలను భాగస్వామ్యం చేయాలని ఆయన సూచించినట్టు అధికారులు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన తరువాత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు గత సంవత్సరం విజయవాడ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన సంగతి తెలిసిందే. అమరావతి ఏర్పాటై అధికారిక పరేడ్ కోసం మైదానం సిద్ధమయ్యేంత వరకూ పంద్రాగస్టు వేడుకలను ఒక్కో సంవత్సరం ఒక్కో జిల్లాలో నిర్వహిస్తామని చంద్రబాబు గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే.

More Telugu News