: అరుణాచల్ ప్రదేశ్ కొత్త సీఎంగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం
అరుణాచల్ ప్రదేశ్ కొత్త సీఎంగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి దోర్నీ ఖండూ కుమారుడైన పెమా ఖండుతో గవర్నర్ తథాగత్ రాయ్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన 48 మంది సభ్యులతో పాటు, పెమా ఖండూకు మద్దతు ఇస్తున్న స్వతంత్ర నేతలు, పార్టీ సీనియర్ నేతలు, ఆత్మీయులు హాజరయ్యారు. పెమా ఖండూతో పాటు మంత్రులుగా ఎవరూ ప్రమాణ స్వీకారం చేయలేదు. కాగా, మంత్రులు త్వరలోనే ప్రమాణ స్వీకారం చేసే అవకాశముంది. అరుణాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం పునురుద్ధణకు ఆదేశిస్తున్నట్లు సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత చోటుచేసుకున్న రాజకీయ మలుపుల నేపథ్యంలో పెమా ఖండూ కాంగ్రెస్
శాసనసభాపక్షనేతగా ఆయన ఎంపికయ్యారు.