: చంద్రబాబువి తాటాకు చప్పుళ్లే... భయపడే సమస్యే లేదన్న వైకాపా
చిత్తూరు జిల్లా నగరిలో నేడు ఉదయం సమావేశమైన వైకాపా నేతల విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాలనను పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు. తమ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలను పలు రకాల ఆశలు చూపి లాక్కున్నారని వ్యాఖ్యానించిన పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, బాబుకు ధైర్యముంటే వారితో రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు. తమను బెదిరిస్తూ చంద్రబాబు, ఆయన అనుచరులు చేస్తున్న వ్యాఖ్యలు తాటాకు చప్పుళ్లేనని, అందుకు భయపడే సమస్యే లేదని అన్నారు. గడచిన రెండేళ్ల పాలనలో ఒక్క హామీని కూడా ఆయన అమలు చేయలేదని విమర్శించారు. ఈ సమావేశానికి పెద్దిరెడ్డితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, రోజాతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు.