: ఐఎస్ఐఎస్ లో చేరిన కేరళీయుడు భార్యకు ఏమని మెసేజ్ పెట్టాడంటే...!

కేరళ నుంచి మాయమైన ముస్లిం యువకుల గురించి ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. వీరంతా ప్రపంచ నాశనాన్ని కోరుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరినట్టు ఎన్ఐఏ అధికారులు నిర్ధారణకు వస్తున్నారు. ఈ మేరకు కాసరగోడ్ జిల్లా నుంచి కనిపించకుండా పోయిన 21 మందిలో ఒకడైన హఫీజుద్దీన్ హకీం (23) తన భార్యకు పంపిన వాట్స్ యాప్ మెసేజ్ ను చూశారు. తనపైన అమెరికా యుద్ధ విమానాలు తిరుగుతున్నాయని ఆ మెసేజ్‌ లో హఫీజుద్దీన్ హకీం పేర్కొన్నాడు. ఈ మెసేజ్ జూన్ 8న తనకు వచ్చిందని హఫీజ్ భార్య షరిఫా దర్యాప్తు అధికారులకు తెలిపింది. హఫీజ్ తన తల్లిదండ్రులను కూడా ఇస్లామిక్ స్టేట్‌ కు రమ్మని ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ‘‘నిజమైన ఇస్లాంను, షరియా చట్టాలను అనుసరించే గడ్డ ఇది’’ అని, ఇక్కడికి రావాలని అతను వారికి తెలిపినట్టు తెలుస్తోంది. దీంతో కేరళ నుంచి వెళ్లిన ముస్లిం యువకులు సిరియా లేదా ఇరాక్ లోని ఐఎస్ఐఎస్ ప్రాబల్య ప్రాంతాల్లో ఉండి ఉండవచ్చని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు.

More Telugu News