: అణు రియాక్టర్ల వల్ల ఉత్తరాంధ్ర శ్మశానమవుతుంది: ప్రకాశ్ కారత్
అణురియాక్టర్ల వల్ల ఉత్తరాంధ్ర శ్మశానమవుతుందని సీపీఎం నేత ప్రకాశ్ కారత్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో ఆయన మాట్లాడుతూ, మొదట్లో గుజరాత్ లో ఈ అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదించారని, అయితే స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించడంతో దానిని కొవ్వాడకు తరలించారని ఆయన చెప్పారు. ప్రపంచంలో ఎక్కడా ఆరు అణు రియాక్టర్లతో అణువిద్యుత్ కేంద్రం నిర్మించలేదని ఆయన తెలిపారు. కేవలం కొవ్వాడలోనే ఆరు అణురియాక్టర్లతో అణువిద్యుత్ కేంద్రం నిర్మించాలని భావిస్తున్నారని ఆయన చెప్పారు. దీంతో ఇక్కడ ఏ చిన్న ప్రమాదం జరిగినా ఉత్తరాంధ్ర మొత్తం శ్మశానమవుతుందని ఆయన పేర్కొన్నారు. అమెరికా, జపాన్ వంటి దేశాల్లో అణువిద్యుత్ కేంద్రాలను నియంత్రించారని ఆయన గుర్తుచేశారు. కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయడం దారుణమని ఆయన అభిప్రాయపడ్డారు.